Nara Lokesh: వార్డెన్‌ను సస్పెండ్ చేసిన నారా లోకేష్..! 22 d ago
AP: గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థినులు శుక్రవారం మధ్యాహ్నం సాంబార్లో కప్ప వచ్చిందని భోజనం మానేసి ధర్నా చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ నిన్న రాత్రి వసతిగృహం వద్ద విద్యార్థినులు ధర్నా చేశారు. హాస్టల్ విద్యార్థినుల ఆందోళనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. విద్యార్థినుల వసతిగృహ వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని, మెస్ కాంట్రాక్టర్‌గా ఉన్న వార్డెన్‌పై విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.